Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం జానంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన హిటాచి ఏటీఎం సెంటర్‌ను విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు విచ్చేసిన రేగాకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామంలో బ్రాంచ్ ఓపెన్ చేయడం ద్వారా సౌకర్యవంతమైన సేవలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నామని విప్ రేగా అన్నారు. అనంతరం జానంపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. జానంపేట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త కన్నెగంటి దుర్గాప్రసాద్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘం డైరెక్టర్ కామేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల కుమార్, బోడ ఈశ్వర్, తదితర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.