Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-ఇల్లందు
గత మూడేళ్లుగా నివసిస్తున్న రాజీవ్ నగర్ గుడిసె వాసులకు తాగునీరు, మౌలిక సదుపాయాలు కరెంటు, ఇంటి నంబర్లు కేటాయించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి ప్రదర్శన చేసి ఎండీఓ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం మండలాధి కారిణికి వినతిపత్రం సమర్పించారు. జరిగిన సభలో మండల కార్యదర్శి అబ్దుల్ నబి మాట్లాడుతూ సిఎస్పి బస్తి పంచాయతీలోని రాజీవ్ నగర్ శివారు ప్రాంతంలో పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతి నిధులు గుడిసెలు తొలగించాలని వారికి తాగునీరు కరెంటు మౌలిక సదుపా యాలు కల్పించకూడదని హుకుం జారీ చేసి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ధారావత్ రాందాస్ అధ్యక్షతన జరిగిన సభలో మన్యం మోహన్ రావు, పాషా వీరస్వామి వీరభద్రం వెంకన్న ఖాదర్ ఖాజా రజియా వైకుంఠం, ఖైరున్, విజయ, సరిత, అమ్మి, పద్మ గొబ్రీయ, కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.