Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఫ్రధాన న్యాయమూర్తి టీ.శ్రీనివాసరావు
కారేపల్లి : చట్టాల అవగాహనతో నేరాల నియంత్రణ జరుగుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి టీ.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి కారేపల్లి మండలం భాగ్యనగర్తండాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు, బాలల పనిలో పెట్టడం వంటివి చట్టాలపై అవగాహన లేకనే జరుగుతున్నాయన్నారు. ఆవేశాలతో జరిగే పోరపాట్లు నేరస్తులను చేస్తుందన్నారు. భూతగాదాలు, వరకట్న వేధింపుల కేసులు అధికంగా వస్తున్నాయని వాటిని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకుంటే ఇరువర్గాలకు శ్రేయస్సుకరమన్నారు. నిందితులుగా ఉన్న పేదలకు ఉచిత న్యాయం అందించటానికి న్యాయ సేవా సంస్ధ సహకరిస్తుందన్నారు. పేదల పక్షన ఉచితంగా న్యాయవాదిని నియమించి వారికి న్యాయం జరిగేలా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, తహసీల్దార్ తూమటి శ్రీనివాస్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్సై పుష్పాల రామారావు తదితరులు పాల్గొన్నారు.