Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
ఇటీవలి కాలంలో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు గుంటల స్థలం విషయంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి రిజిస్ట్రార్ ను పరేషాన్ కు గురిచేశాడు. మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ఇండ్ల గోపాలరావు తనకు చెందిన రెండు గుంటల స్థలాన్ని గ్రామానికి చెందిన సామినేని కృష్ణ మూర్తి ద్వారా చింత నిప్పు మురళీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడని కొందరు విలేఖరులను వెంట బెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. మురళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలం నాదని రిజిస్ట్రార్‌తో వాదించాడు. అందుకు సబ్ రిజిస్ట్రార్ మోయిజ్ అలీ స్థలం నీకు చెందినట్లు ఎటువంటి పేపరు తెచ్చినా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు. లింక్ డాక్యుమెంట్‌తో సహా అన్ని ఆధారాలు ఉంటే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం నాకు లేదని చెప్పినా వినిపించుకాకుండా వెంట తెచ్చుకున్న పురుగు మందు అక్కడే తాగే ప్రయత్నం చేశాడు. ఈ గందర గోళంలో మందు కొంత తాగాడని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ కార్యాలయం జరిగిన సంఘటన అయినందున ఖమ్మం వెళ్ళటం మంచిదని డాక్టర్ తెలుపగా గోపాలరావును తరలించారు. వివరాల్లోకి వెళితే ఇండ్ల గోపాలరావు వైరా గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మునిసిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ తన భార్య వసంతను గ్రామ పంచాయతీ సభ్యురాలిగా గెలిపించుకున్నాడు. 2019లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మరలా తన భార్య వసంతను 11 వ వార్డు లో కౌన్సిలర్ గా పోటీకి నిలిపాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం చింత నిప్పు మురళీని ఆశ్రయించాడు. 5 లక్షలు తీసుకుని తనదని చెబుతున్న రెండు గుంటల స్థలాన్ని భూ యజమాని సామినేని కృష్ణ మూర్తి ద్వారా మురళికి అప్పుడే అగ్రిమెంట్ చేయించాడని, భూ యజమాని నుండి గోపాలరావు ఏ విధమైన అగ్రిమెంట్ చేయించుకోలేదని తెలుస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత మురళీ గోపాల రావును డబ్బులు అడగటం, పోలీస్ స్టేషన్ వరకు పంచాయితీ వెళ్ళింది. అక్కడ నాకు మూడు నెలల సమయం కావాలని కోరినట్లు, అందుకు మురళీ నాలుగు నెలలకు డబ్బులు ఇచ్చినా నా స్వంత ఖర్చులతో తిరిగి నీ ప్లాటును నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పినట్లు, అందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.
శుక్రవారం ఉదయం రెండు గుంటల స్థలాన్ని సామినేని కృష్ణ మూర్తి ముందు చేసిన అగ్రిమెంట్ ప్రకారం తనకున్న లింక్ డాక్యుమెంట్ తో సహా వచ్చి మురళికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్లి న గోపాల రావు పురుగుమందు తాగాడు.