Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
నవతెలంగాణ-ఎర్రుపాలెం
పల్లె నుండి ప్రపంచ స్థాయి కబడ్డీ పోటీలకు యరమల యజ్ఞతా రెడ్డి తన ప్రతిభను కనపరచి అవకాశాన్ని తన సొంతం చేసుకుంది. ఎర్రుపాలెం మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన యరమల శ్రీనివాస రెడ్డి, విజయ నిర్మల దంపతుల పెద్ద కుమార్తె యజ్ఞతా రెడ్డి చిన్న తనం నుండి కబడ్డీపై ఆసక్తి కనబరుస్తూ ఒకటి నుండి 8 తరగతి వరకు బనిగండ్లపాడు పాఠశాల నందు విద్యను అభ్యసిస్తూనే కబడ్డీ పోటీలలో పాల్గొనేది. అనంతరం 9,10 తరగతులు గురుకుల పాఠశాలలో చదువుతున్న సమయంలో వరంగల్, ఖమ్మం, పరకాలలో, జిల్లా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని అవార్డులను సాధించింది. ఇంటర్ మధిర సుశీల కాలేజీ నందు పూర్తి చేసి, అనంతరం మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీ హైదరాబాద్ నందు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువు తున్న యజ్ఞతారెడ్డి ఈ నెల 16 నుండి సోమవారం వరకు నిర్వహించిన ఇండియా -నేపాల్ కబడ్డీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచింది. ప్రపంచ కబడ్డీ పోటీ లకు భారత జట్టు నుండి ఎంపికైనట్లు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. యజ్ఞతారెడ్డికి పలువురు అభినందనలు తెలియ జేసారు.