Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజరుకుమార్
- రూ.67.59 లక్షలతో నూతన స్కూల్ నిర్మాణం
- నాణ్యమైన విద్య అందించాలనే ధృడసంకల్పంతో 'మన ఊరు మనబడి'
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దఢసంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనఊరు. మనబడి ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ''మన ఊరు-మన బడి''లో భాగంగా ఖమ్మం నగరంలోని స్థానిక 40వ డివిజన్ లో మోమినన్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల రూ.67.59 లక్షలతో నూతనంగా నిర్మించిన తరగతి గదులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోందన్నారు. పాఠశాలల్లో ప్రధానంగా 12 మౌళిక వసతులను కల్పించి ప్రభుత్వ విద్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పాఠశాల గోడలపై ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూసి మంత్రి పువ్వాడ సంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక కార్పొరేటర్ దాదే అమృత మాట్లాడుతూ.. విద్యాలయాలు దేవాలయాలాంటివని వాటిని కార్పొరేట్ స్కూల్ కంటే గొప్పగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డిప్యూటీ కమిషనర్ ఫాతిమా జోహార, డీఈఓ సోమశేఖర్ శర్మ, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
జామా మస్జీద్కు మంత్రి పువ్వాడ విరాళం
ఖమ్మం నగరంలోని కమన్ బజార్లో ఉన్న జామా మసీదును మంత్రి పువ్వాడ అజరు కుమార్ శుక్రవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ మత పెద్దలు మంత్రి పువ్వాడ అజరు కుమార్ కి పలు సమస్యలపై నివేదించారు. తక్షణమే స్పందించిన మంత్రి పువ్వాడ మస్జిద్ అభివృద్ధి కోసం పువ్వాడ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయల నగదును ప్రకటించారు. నగదును మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం నందు మత పెద్దలకు అందజేశారు. అదేవిధంగా మస్జీద్ ప్రహరీ గోడ నిర్మాణానికి అంచనా వ్యయం వేసి ఇవ్వాలని మంత్రి పువ్వాడ జామా మస్జీద్ మత పెద్దలను కోరారు.