Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని వీరభద్రం నివాళి
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండలంలోని మోటా పురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నేత చావా అప్పారావు(78) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్, సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు హుటాహుటిన ముఠాపురం చేరుకొని అప్పారావు భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ అప్పారావు పార్టీ పట్ల అత్యంత విశ్వాసం, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం పార్టీ అభివృద్ధికి తీరని లోటు అన్నారు. పార్టీ అభివృద్ధికి అప్పారావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో సిపిఐ(ఎం) జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి, నాయకులు ఏటుకూరి రామారావు, తోటకూరి రాజశేఖర్, ఇంటూరి అశోక్, బెల్లం లక్ష్మి, ఏలూరి రంగారావు, గుగులోతు వీరు నాయక్, గ్రామస్తులు నున్న రవికుమార్, గుడిమళ్ల మధు, చావా అజయ్, చావా కిరణ్, చావ లెనిన్, ఏలూరి రామారావు తదితరులు ఉన్నారు.