Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలో ఢిల్లీని జయప్రదం చేయండి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి
నవతెలంగాణ-వేంసూరు
మోడీ నుండి దేశాన్ని కాపాడుకునేందుకు కార్మికులు కర్షకులు కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఎర్ర రామయ్య భవనం నందు జరిగిన సెమినార్లో భారతి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ అంబానీ, అదాని కోసమే పనిచేస్తున్న మోడీ విధానాలను అరికట్టేందుకు అన్ని వర్గాలు ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీనిలో బాగాంగా ఏప్రిల్ 5న కార్మిక సంఘాలు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. వేంసూరు మండలం పోరాటాలకు పెట్టిందే పేరు అని అదే దారిలో నాయకులు ప్రజా సమస్యలపై పని చేస్తూ పోరాటాలలో ముందుండాలని సూచించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చలమాల విఠల్రావు మాట్లాడుతూ మోడీ ఒలంపిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలు పల్లెల్లో పాదయాత్రలు చేసేందుకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఆదేశాల మేరకు గ్రామాలలో పాదయాత్రకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్రావు, సిఐటియు మండల కన్వీనర్ మల్లూరు చంద్రశేఖర్, రైతు సంఘం మండల కార్యదర్శి అరవపల్లి గోపాలరావు, రైతు సంఘం నాయకులు రావుల రాజబాబు, మోరంపూడి వెంకటేశ్వరరావు, కొత్త సత్యనారాయణ, ప్రసాద్, వెలిగినేని రాంబాబు, గడిపర్తి మోహన్రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.