Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ రవిచంద్ర
నవతెలంగాణ - ముదిగొండ
ముదిగొండ -సువర్ణపురంల మధ్య అండర్ పాస్ నిర్మించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోదాడ-కురవి నేషనల్ హైవే పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ముదిగొండ మండలం ఖానాపురంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పసుపులేటి వెంకట్ తదితరులు నేషనల్ హైవే కారణంగా ముదిగొండ -సువర్ణాపురం రోడ్డులో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అండర్ పాస్ నిర్మించాల్సిన అవసరాన్ని తెలిపారు. ఎంపీ రవిచంద్ర వెంటనే స్పందించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేషీ అధికారులతో వీడియో ఫోన్ ద్వారా అక్కడి పరిసరాలను చూపుతూ వివరించగా, వారు సానుకూలంగా స్పందించారు.