Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలలో నెంబర్ వన్
- కలిసి కట్టుగా పనిచేస్తే వార్ వన్ సైడ్
- ఎంపీ నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ-వైరా
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలో లేవు. వాటిని పదే పదే ప్రజలకు గుర్తు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల పార్టీ సమావేశానికి నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందు 20 లక్షల మంది వలసలు పోయే దుస్థితిని రూపు మాపి మన రాష్ట్రంలోకి 12 లక్షల మంది వలస వచ్చే విధంగా అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని పథకాలు ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కలిసి కట్టుగా పనిచేస్తే వార్ వన్ సైడ్ అన్నారు. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 2014, 2018 లో కూడా ఒక్కొక్క సీటే గెల్చుకున్నామని గుర్తు చేస్తూ మనం ఎప్పుడు పార్టీలో చేరినా గౌరవించి పదవులు ఇచ్చారని అన్నారు. అటువంటి పదవులు, హౌదా లు అనుభవిస్తూ ఎమ్మెల్యే రాములు నాయక్ ను మేమే గెలిపించామని చెప్పటం అహంకారం అన్నారు. ఆనాడు టిఆర్ఎస్ నాయకులుగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్ ను ఎలా గెలిపించారని బిఆర్ఎస్ బహిష్కృత నాయకులనుద్దేసించి విమర్శించారు. ఆనాడు ఏదో చేశామని ఇప్పుడు బిఆర్ఎస్ను ఏదో చేయాలని చూస్తే కుదిరే పని కాదని, ఐరన్ పిల్లర్స్ తో నిర్మించ బడిన పార్టీని ఢ కొట్టాలని చూస్తే తలలు పగిలి చస్తారని పరోక్షంగా పొంగులేటి వర్గాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రగతి భవన్ ను పేల్చేస్తామని ఒకడు, కూల్చేస్తాం అని ఇంకొకడు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ ఒక టివికి ఇంటర్యూ ఇస్తూ ముఖ్యమంత్రి అపర చాణక్యుడు అని కీర్తించటం మనం చూస్తున్నామని అటువంటి నాయకుడు ఉన్న బిఆర్ఎస్ను ఒకరిద్దరు అమాంబాపతు ఏం చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ మనపై అవాకులు చవాకులు వాగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సామ దాన భేద దండోపాయలను సవి చూడాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికె రత్నం, మునిసిపల్ వైస్ చైర్మన్ ముళ్ళ పాటి సీతారాములు, దిశా జిల్లా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున రావు, పసుపులేటి మోహన్ రావు మచ్చా బుజ్జి, పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు.