Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా నాయకులు మందా సైదులు
నవతెలంగాణ-మధిర
మధిర మండలంలోని పలు గ్రామాల చెరువులను సాగర్ జలాలతో నింపాలని, సాగర్ ఆయకట్టు చివరి పొలాల వరకు జలాలు అందించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు మందా సైదులు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో వరి, మిర్చి, మొక్కజొన్న, చెరుకు పంటలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. పంట చేతికందే సమయంలో నీళ్లు అందక పంట నష్టం జరుగుతుందన్నారు. వారాబంధిని ఎత్తివేసి నిరాటంకంగా సాగర్ జలాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వంగవీడు, అల్లినగరం గ్రామస్తులు ఆందోళన బాట పట్టారని అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కుక్క మోహన్ రావు, కార్మిక సంఘం నాయకులు పడకంటి మురళి, విద్యార్థి యువజన సంఘం నాయకులు వడ్రానపు మధు, మద్దాల ప్రభాకర్ పాల్గొన్నారు.