Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-కల్లూరు
రైతుల చేతుల్లో ఉన్న వ్యవసాయంను కేంద్ర ప్రభుత్వ విధానాలతో బుల్డోజ చేస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం ముదిగొండ అంజయ్య అధ్యక్షతన మండల కార్మిక కర్షక సదస్సులో రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు భారీ కోత విధించిందని అన్నారు. ఎరువులు సబ్సిడీ ఏభై వేల కోట్ల రూపాయల కేటాయింపు తగ్గించడం, కేంద్ర వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు, ధరలు స్థిరీకరణ నిధికి నిధులు కేటాయింపు చేయకపోవడం, భారత పత్తి సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐకు లక్ష రూపాయల కేటాయింపు వ్యవసాయ రంగం కార్పొరేట్ కంపెనీలు పరం చేయుటకు అన్నారు. ఆహార భద్రతకు నిధులు కేటాయింపు పెంచాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఏప్రిల్ 5న ఢిల్లీలో పది లక్షల మంది రైతులు కార్మికులు మహా ప్రదర్శన జరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తామని అన్నారు ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు తన్నీరు కృష్ణార్జున్, రైతు సంఘం జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు, సామేనేని హనుమయ్య, బట్టు నరసింహారావు, రేసు నాగేశ్వరరావు, నాయుడు, వల్లే బోయిన రామనాథం, రావి వెంకటసత్యం, ముంత మాధవరావు పాల్గొన్నారు.