Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా ర్యాలీ
- బయ్యారం ఉక్కు పరిశ్రమతో యువతకు ఉపాధి
నవతెలంగాణ-కారేపల్లి
గిరిజనుల సమస్యలపై ఉద్యమ ప్రణాళికతో ముందుకెళ్ళటానికి నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన సంఘం 3వ జిల్లా మహాసభకు వేదికైన కారేపల్లి ముస్తాబైంది. నేడు జరగనున్న మహాసభలకు వచ్చే అతిధుతులు, పోరాట భాగస్వాములకు కారేపల్లి వీధులు, ప్రధాన కూడళ్శ గిరిజన సంఘం తోరణాలు ఆహ్వానం పలుకుతున్నాయి. మహాసభ ల ఏర్పాట్లను ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడు శోభన్. ఆహ్వానం సంఘం అధ్యక్షులు ఉసిరికాయలపల్లి సర్పంచ్ బానోత్ బన్సీలాల్ పర్యవేక్షించారు. ఈసందర్బంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ఏజన్సీలో గిరిజన యువత ఉపాధి లేక వలస పోతున్నారన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తో ఈప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఏజన్సీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు కు ఉద్యమించాల్సి అవసరం ఉందన్నారు. కారేపల్లిలో జరిగే మహాసభలకు ప్రతి గిరిజన కుటుంబం తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు వజ్జా రామారావు, అజ్మీర శోభన్నాయక్, భూక్యా హుస్సెన్ తదితరులు పాల్గొన్నారు.