Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వెనుకబడిన గిరిజన కొండా రెడ్డి గ్రామాలలో 200 మంది పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యాక్రమం రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో 'స్మైల్ ఫౌండేషన్' వారి సహకారంతో పూసుకుంటా, పాత రెడ్డిగూడెం, సుద్దగోతులగూడెం, నిడివిరెడ్డిగూడెం, బండారు గుంపు, తిరుమలకుంట గ్రామాలలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి ఆయా గ్రామాల సర్పంచులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు, సర్పంచులు యట్ల మహేశ్వర్ రెడ్డి, ఉమ్మలా దుర్గ, కే.రవి, కే.బాబు, బీ.పవన్ తదితరులు పాల్గొన్నారు.