Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని 15వ నెంబర్ బస్తి డీ బ్లాక్ వద్ద నివాసముంటున్న శంకర్ పాసి ఇంట్లో ఇటీవల కుక్కలు దాడి చేసి తొమ్మిది మేకలు మృతి చెందిన ఘట్టనా స్థలాన్ని ప్రభుత్వ పశు వైద్యాధికారిని డాక్టర్ విజయ అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ మాజీ జంతు సంక్షేమ బోర్డు సభ్యుడు గాయత్రి పరివార్ సతీష్ ఖండేల్వాల్ సందర్శించారు. ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే బాధితులు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే, పోలీసు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు అందజేసిన విజ్ఞప్తి పత్రంలో కోరారు. కలెక్టర్ ద్వారా ఆర్థికంగా సహాయం చేయాలని విన్నమించుకున్నారు. సతీష్ ఖండేల్వాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ అక్కిరాజు గణేష్, వెటర్నరీ అసిస్టెంట్ ఉదయ్ కుమార్, బస్తీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.