Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
- తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీకి హామీ
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిసి వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ ప్రాంగణంలోని మంత్రి జగదీష్ రెడ్డిని వారి కార్యాలయంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జయంతి యాక్షన్ కమిటీ కలిసి 2022 ఏప్రిల్ నుంచి విద్యుత్ ఉద్యోగులకు, ఆర్టిజన్స్కు అమలు చేయవలసిన పీఆర్సీని వెనువెంటనే అమలు పరచాలని, ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్కు ఆర్టిజన్స్ ముఖ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశం ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జెంట్ యాక్షన్ కమిటీ నాయకులు కోడూరు. ప్రకాష్, శివాజీ, జాన్సన్, అంజయ్య, చారుగుండ్ల రమేష్, గణేష్, యూసుఫ్, దేవేందర్ రెడ్డి, రాములు, రామయ్య శెట్టి, ప్రవీణ్ కుమార్, మాతంగి శీను తదితరులు పాల్గొన్నారు.