Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
వర్కింగ్ జర్నలిస్లులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును భద్రాచలం జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం పినపాక నియోజకవర్గం కరకగూడెం గ్రామంలో రేగాని కలిసి జర్నలిస్టుల స్థలాలకు సంబంధించిన సమస్యపై చర్చించి, వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన రేగా ఇందుకు సంబంధించి కలెక్టర్‌తో మాట్లాడి జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రేగాని కలిసిన వారిలో భద్రాచలం జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు మొబగాపు ఆనంద్ కుమార్ (టీయూడబ్ల్యూజే ఏజేయూ), తోటమల్ల బాలయోగి (టీయూడబ్ల్యూజే టీజే), కర్రా అనిల్ రెడ్డి (టీడబ్ల్యూజేఎఫ్), కాటా సత్యం ((టీయూడబ్ల్యూజే టీజేఎఫ్), పూనెం ప్రదీప్ ((టీయూడబ్ల్యూజే టీజేఎఫ్), డి,రవికుమార్ (టీడబ్ల్యూజేఎఫ్), గండేబోయిన వెంకటేశ్వర్లు ((టీడబ్ల్యూజేఎఫ్), సాయి సంపత్ రెడ్డి ((టీడబ్ల్యూజేఎఫ్) తదితరులు ఉన్నారు.