Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారం కోసం మార్చి 1, 2, 3 తేదీలలో రాష్ట్ర వ్యాప్త సమ్మె
- సమ్మెను జయప్రదం చేయండి జి.పద్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని వీటిని పరిష్కారం చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసి పేద ప్రజలతో పాటు అంగన్వాడీ ఉద్యోగులకు ఉపాధికి నష్టం కలిగించే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సీఐటీయూ అంగన్వాడి జిల్లా కార్యదర్శి జి.పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తన పరిధిలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదన్నారు. పర్మినెంట్ కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడుస్తున్న నేటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగులకు చెల్లించడం లేదన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్ట్లు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 1న ప్రాజెక్టు కేంద్రాల్లో ర్యాలీలను మార్చి 2, 3 తేదీల్లో కలెక్టర్ ఆఫీస్ ముందు 36 గంటల దీక్షను జయప్రదం చేయాలని అంగన్వాడి టీచర్ హెల్పర్స్ మినీ టీచర్స్ పిలుపు నిచ్చారు.