Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీ జిల్లా అధ్యక్షులు యండి.యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర మైనార్టీ కమిషన్ నూతన పాలక మండలిని నియమించాలని జిల్లా మైనార్టీ అధ్యక్షులు యండి.యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. గతంలో నియమించబడిన మైనార్టీ కమిషన్ పదవీకాలం ముగిసి 2 యేండ్లు గడచిన నేటివరకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలక మండలి నియామకం చేపట్టలేదని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ వర్గాలకు చెందిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదని, దీని కారణంగా తమ సమస్యలు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మైనార్టీలు వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే ప్రభుత్వం, మైనార్టీ కమిషన్ ఛైర్మన్‌తో పాటు, పాలక మండలి సభ్యుల నియామకం వెంటనే చేపట్టాలని యాకూబ్ పాషా సూచించారు.