Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుమిత్ర వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ కొత్త రజిని
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుమిత్రుల శ్రమ దోచుకుంటుందని పశుమిత్ర వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఆఫీస్ బేరర్ కొత్త రజిని అన్నారు. శనివారం జిల్లా పశుమిత్రల జిల్లా స్థాయి సమావేశం పద్మ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రజిని పాల్గొని మాట్లాడారు. పశుమిత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర స్కీమ్ వర్కర్లకు ఇస్తున్నట్లుగా గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 8 ఏండ్లుగా పశుమిత్రలకు ఎలాంటి వేతనం గానీ, పారితోషికం గానీ ఇవ్వకుండా పశుమిత్రల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం సరైంది కాదు అన్నారు. అనంతరం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ పద్మ మాట్లాడుతూ పశుమిత్రలకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి కార్మికులుగా గర్తించాలని, యూనిఫాం, గ్లౌజులు, మాస్కలు, మందులతో కూడిన కిట్ పశుమిత్రలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇఎస్ఐ, పిఎఫ్, సౌకర్యం కల్పించాలని, ఏ-1 శిక్షణ పశుమిత్రలందరికీ ఇవ్వాలని ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నూతన కమిటీ ఎన్నిక
జిల్లా కమిటీ సమావేశం అనంతరం జిల్లా నూతన కన్వీనింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కన్వీనర్‌గా రాణిని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా కుసుమ, కృష్ణ వేణి, సరళ, సుమలత, పుష్ప, ఆదిలక్ష్మి, సమ్మక్కలను ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీని పలువురు అభినందించారు.