Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్
నవతెలంగాణ-ఇల్లందు
మంచి మార్గంలో నడుస్తూ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్ అన్నారు. సబ్ జైలును శనివారం సందర్శించారు. ఖైదీల వివరాలు అడిగితెలుసుకున్నారు. న్యాయవాదులు నియమించుకోలేని ఆర్థిక స్తోమత లేని కక్షిదారులను ఉచిత న్యాయ సహాయం ద్వారా న్యాయ సహాయం పొందాలని అన్నారు. వారికి గవర్నమెంట్ న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నియమించబడిన న్యాయవాది కేసు పూర్తి అయ్యే వరకు వాదనను వినిపిస్తారని తెలిపారు. జైల్లో ఖైదీలకు ఏర్పాటు చేసే మెనూ టైం ప్రకారం అందుతున్నాయా లేవా అని కక్షిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ న్యాయవాదులు కాంపల్లి ఉమామహేశ్వరరావు, కోర్టు సిబ్బంది స్వామినాథం, సబ్ జైలు సూపర్డెంట్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.