Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే పాయం
నవతెలంగాణ-మణుగూరు
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఊపిరి ఉన్నంతవరకు ప్రజల్లోనే ఉంటానని మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం హనుమాన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావు మూడు పదవులు అనుభవిస్తూ మతిస్థిమితం లేని విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి ప్రణాళిక సర్వం సిద్ధం చేసి నివేదికని పంపిస్తే దాని ఆధారంగానే వచ్చిన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు పేరుతో ఓపెనింగ్లు చేస్తూ ఫోజులిచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రసారం చేసు కుంటున్నాడని రేగా కాంతారావుని విమర్శించారు. ఆయన సొంత మండలం అయిన వట్టి వాగు, పొలుసు బొంత ఆయకట్టు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి నిధులు మంజూరు చేపించింది నేను కానీ శంకుస్థాపనల పేరుతో డబ్బా కొట్టుకునేది రేగా అన్నారు.
సంపాదన, అక్రమ ఆస్తులే ధ్యేయంగా నియోజకవర్గం అభివృద్ధిలో 10 సంవత్సరాల వెనక్కి పోయిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, చింతల కృష్ణ, పాషా, తదితరులు పాల్గొన్నారు.