Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ పంచాయతీ అధికార్లకు కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజలు కుక్కకాటుకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. కుక్కల వృద్ధిరేటును తగ్గించేందుకు నియంత్రణ ఆపరేషన్ నిర్వహించేందుకు అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి, జాప్యం చేయక ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. సోమవారం నుండి ఆపరేషన్లు ప్రక్రియ ప్రారంభించాలని, కుటుంబ నియంత్రణ కేంద్రంలో ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ప్రత్యేక పర్యవేక్షణకు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌ను నోడల్ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మిషన్ మూడులో ప్రత్యేక వైద్యులను నియమించి ఆపరేషన్ ప్రక్రియ చేపట్టారని చెప్పారు. రోజుకు 100 కుక్కలకు ఆపరేషన్ నిర్వహించాలని తెలిపారు. ఆపరేషన్లకు తరలించేందుకు మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కుక్కలను పట్టుకుని వాళ్లతో పాటు వాహనాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలలో మాంసపు దుకాణాలు యజమానులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలు బయట వేయకుండా అవగాహన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఫంక్షన్ హాల్లోని వ్యర్ధాలను మున్సిపల్ గ్రామపంచాయతీ సిబ్బందికి అప్పగించాలని, ఆరుబయట వేయొద్దని చెప్పారు. ఆరు బయట వేసే కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పంచాయతీ అధికారం ఆదేశించారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కుక్క, కోతికాటు మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికాలను ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీఓ రమాకాంత్, వైద్యాధికారులు డాక్టర్ ముక్కండేశ్వరరావు, రామకృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు రఘు, శ్రీకాంత్, అంకుష్ వలి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.