Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ
నవతెలంగాణ-అశ్వాపురం
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఎంపీపీ ముత్తినేని సుజాత అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం అధికారులు గడచిన మూడు నెలల కాలంలోని ప్రగతి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ, ఎంపీడీవో వరప్రసాద్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరిపుద్దీన్, యూడీసీ పద్మావతి, ఎంపీఓ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.