Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపం తెలిపిన రాజకీయ పార్టీలు
నవతెలంగాణ-మణుగూరు
సీపీఐ(ఎం) అశోక్ నగర్ శాఖ కార్యదర్శి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు పిట్టల కృష్ణ (51) గుండెపోటుతో శనివారం మరణించారు. కృష్ణ భార్య నాగమణి పార్టీ మండల కమిటీ సభ్యురాలు, వ్యవసాకారము సంఘం మండల కార్యదర్శిగా పని చేస్తున్నారు. కూతురు, కుమారుడు ఉన్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు కృష్ణ మృతదేహంపై ఎర్రజెండా కప్పి జోహార్లు అర్పించారు. కృష్ణ మృతదేహాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్ సందర్శించి పూల మాలలు వేసి జోహార్లు అర్పించారు. మండల కార్యదర్శి పూలమాలవేసి సంతాపం తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య మరణ వార్త తెలియగానే మండల కార్యదర్శి జంగం మోహన్ రావు, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మూన్న లక్ష్మీ కుమారి, జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి అక్కి నరసింహారావు పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించి, సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పేరునాకి నవీన్, నియోజకవర్గ కో కన్వీనర్ కాటిపోయిన నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలవేసి సంతాపం తెలిపారు. సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి కృష్ణ మృతి దానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. పార్టీ నాయకులు గద్దల శ్రీనివాసరావు, ఉపతల నరసింహారావు, టీవీఎంవి ప్రసాద్, ములకల ఉత్తం, తోట పద్మ, వై.నాగలక్ష్మి, సంకినేని వెంకటరావు, రామగిరి రవీందర్, కుంజా రాజు, బేగం, కామ్రేడ్ కృష్ణకు జోహార్పించారు. కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతి తెలిపారు.