Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీలు నామ నాగేశ్వరరావు,బండి పార్థసారథిరెడ్డి
- 7న వ్యవసాయశాఖ మంత్రి రాక: ఎంఎల్ఏ సండ్ర
నవతెలంగాణ-వేంసూరు
దేశంలో ఎక్కడా జరగని చూడని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని బిఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం వేంసూరు మండలంలో 3.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాప నలను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ బండి పార్థసారధి రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు చేశారు. చోడవరం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని ప్రారంభించారు. రాయుడుపాలెం, కల్లూరు గూడెం, వైయస్ బంజర్, అడసర్ల పాడు, ముద్దుల గూడెం, రామన్నపాలెం గ్రామాలలో సీసీ రోడ్లు కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆడసర్లపాడులో జరిగిన సభలో ఎంపీ బండి పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తన కంపెనీలో వేంసూరు మండలానికి జాబ్ మేళా నిర్వహించి 100 ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తను స్థాపించిన సాయిస్ఫూర్తి ట్రస్ట్ ద్వారా నియోజక వర్గంలో చర్చలకు, దేవాలయాలకు, మసీదులకు కావలసిన విగ్రహాలను ఉచితంగా అందిస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో సీతారామ ప్రాజెక్టు ద్వారా వేంసూరు మండలం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ అందరి సహకారంతో నియోజవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని. 7న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వేంసూరు మండలంలో పర్యటించనున్నారని, కందుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహౌత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ప్రారంభిస్తారని, కల్లూరు గూడెంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని మంత్రి పరిశీలించనున్నారని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ హరికృష్ణారెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పిటిసి సుమలత, సురేష్, వైస్ ఎంపీపీ దొడ్డ శ్రీలక్ష్మి, వెంకట కృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీటీసీ గొర్ల శ్రీనివాసరెడ్డి, సర్పంచులు గాయం సద్గుణావతి, రాంబాబు, ప్రేమలత, శంకర్ రెడ్డి, జమలారావు రావూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.