Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ పవర్ జేఏసీ యం.ప్రసాద్
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
విద్యుత్ శాఖలో వేతన సవరణ చేయాల్సిన గడువు దాటి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు వేతన సవరణ చేయలేదని, కావున వెంటనే వేతన సవరణ చేసి కిందిస్థాయి ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని విద్యుత్ పవర్ జేఏసీ యం.ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో ఖమ్మం జిల్లాలలో పలు ఆఫీసులో యందు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం విద్యుత్తు ఎస్సీ కార్యాలయం డివిజన్ కార్యాలయం వీఆర్వో కార్యాలయం రూరల్ ఈఆర్ఓ కార్యాలయం పలు ఏఈల ఆఫీసుల యందు సబ్ స్టేషన్ల యందు కార్మికులు తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్షను యూనియన్ లీడర్లు మరియు డివిజన్ లీడర్లు మరియు సర్కిల్ లీడర్లు నాయకత్వాలు వహించారు. ఈ కార్యక్రమంలో హీరా లాల్, శేషగిరి, రవికుమార్ సీతారాం గోపాల్ , ప్రసాద్ రగోత్తంరెడ్డి, నరేష్ కుమార్, రామకృష్ణ, నాగార్జున, మడిక శ్రీనివాస్ మధుసూదన్ రావు, పుష్ప రాణి, వంశి కే.నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.