Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్పీ ఎ.సుభాష్‌చంద్రబోస్
- ఘనంగా శ్రీచైతన్య పాఠశాలల వైజ్ఞానిక ప్రదర్శన
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టడం ద్వారా విద్యార్ధులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడంతోపాటు శాస్త్రీయ దృక్పదం అలవడుతుందని ఏఎస్పీ సుభాష్‌చంద్రబోస్ అన్నారు. శ్రీచైతన్య పాఠశాల విద్యార్ధులు చేపట్టిన వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఎక్స్పో)ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో విద్యార్ధులు రాణించాలన్నారు. విద్యార్ధులు తమ నైపుణ్యాన్ని బహిర్గతం చేసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా 75 వైజ్ఞానిక నమూనాలను ఆయన తిలకించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా విద్యార్ధులను విద్యతోపాటు సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతున్న యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం శ్రీచైతన్య తెలంగాణ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన భావితరాలకు ఉపయోగపడేలా, నూతన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండే విధంగా ఉందన్నారు. తరిగిపోతున్న ఇంధన వననరులకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన నమూనాలతో పాటు విద్యార్ధులు తయారు చేసిన ప్రదర్శనలను వారు తిలకించారు. కార్యక్రమంలో డి.జీ.యం. చేతన్ మాధుర్, పాఠశాల ప్రిన్సిపాల్స్ టిఎల్ఎన్.శర్మ, మురళి మోహన్, నీరజ, శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్స్ రామకృష్ణారెడ్డి, సురేష్, డిన్స్ కె.వి.అర్, విష్ణు, పృద్వీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.