Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పాలేరు డివిజన్ ఇన్చార్జి బండి రమేష్
నవతెలంగాణ-నేలకొండపల్లి
సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు, ప్రజానాట్యమండలి కళాకారుడు మారుతి రంగయ్య ఆశయసాధనకు ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సిపిఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో ఎం.రంగయ్య 23వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు గ్రామానికి చెందిన అమరవీరులు రాచకొండ రామదాసు, మారుతి రామసంఘం, షేక్ రంజాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల నాయకులు మారుతి కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో బండి రమేష్ మాట్లాడుతూ రంగయ్య తన చిన్నతనం నుండే ప్రజానాట్యమండలి కళా రంగం పట్ల ఆకర్షితుడై తన గళం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను ప్రజా సమస్యలపై చైతన్యవంతం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండల కార్యదర్శులు నండ్రా ప్రసాద్, కెవి రామిరెడ్డి, డేగల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు నూతలపాటి అప్పారావు, శాఖ కార్యదర్శి మారుతి సూర్యనారాయణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సదానందం, నామా లక్ష్మీనారాయణ, నందిగామ కృష్ణ, వేగినాటి వెంకటేశ్వర్లు, రవి, గాదె వెంకటేశ్వరరావు, గ్రామ నాయకులు గుడిపల్లి నవీన్, బోనగిరి గోపి, షేక్ నాగులుమీరా తదితరులు పాల్గొన్నారు.