Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు ఉపాధ్యాయులకు ఇరువురి పేర్లే నమోదు
- ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారిన ఓ ఉపాధ్యాయుడి వైఖరి
- శిలాఫలకంపై నా పేరు ఉంటుందని నాకే తెలియదు : హెచ్ఎం కమల
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్ చేతులు మీదుగా శనివారం ప్రారంభించిన మండల పరిధిలోని అచ్యుతాపురం మన ఊరు-మన బడి పాఠశాల భవనం శిలాఫలకం పై ప్రొటోకాల్ అంశం వివాదాస్పదం అవుతుంది. ఈ విషయాన్ని ప్రారంభం సమయంలోనే మండల స్థాయి అధికారులు గుర్తించినప్పుడు మంత్రి హాజరైన కార్యక్రమంలో గడబిడ చేయడం సమంజసం కాదని ఉపాధ్యాయులు మిన్నకుండిపోయారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మండల విద్యాధికారికి తలనొప్పి తెచ్చేలా ఉందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విద్యాశాఖ ప్రస్తుతం పరిపాలనా విధానం ప్రకారం డీఈఓ, ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం, సంబంధిత పాఠశాల హెచ్.ఎం పేర్లు శిలాఫలకం పై నమోదు చేయాలి. కానీ ప్రస్తుతం ఈ శిలాఫలకం పై స్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం పేరు నమోదు చేయలేదు.హెచ్.ఎం పేరు నమోదు అయింది. కానీ మరో సహా ఉపాధ్యాయుడు పేరు నమోదు కావడం ఇక్కడ వివాదానికి అవకాశం కల్పించింది. ఈ పాఠశాలలో హెచ్.ఎం కమలతో పాటు విరేశ్వరరావు, లక్ష్మీ నర్స్, రామక్రిష్ణ అనే ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కానీ హెచ్.ఎం కమలతో పాటు సహా ఉపాధ్యాయుడిగా లక్ష్మి నర్స్ గౌడ్ పేరు నమోదు చేసారు. దీంతో మిగతా ఇద్దరు ఉపాధ్యాయులు ఈ విషయాన్ని ఎంఈఓ క్రిష్ణయ్య దృష్టికి తీసుకెళ్ళి అభ్యంతరం తెలిపారు. శిలా ఫలకం పై ఉంటే పాఠశాలలో పని చేస్తున్న నలుగురు పేర్లు ఉండాలని, కుదరని పక్షంలో హెచ్.ఎం కమలతో సహా ఉపాధ్యాయులు అని మాత్రమే నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రొటోకాల్ జిల్లా అధికారులు పరిధిలోకి వస్తుంది : ఎంఈఓ క్రిష్ణయ్య
ప్రొటోకాల్ జిల్లా రెవిన్యూ అధికారుల పరిధిలోకి వస్తుందని, ఈ విషయం హెచ్.ఎం సూచన మేరకు పాఠశాల పేర్లు నమోదు చేస్తారు.
నా పేరు ఉంటుందని శిలాఫలకం చూసే వరకు నాకు తెలియదు : హెచ్.ఎం కమల
శిలాఫలకం పై నా పేరు ఉంటుందని దాన్ని చూసే వరకు తెలియదని, మరో ఉపాధ్యాయుడి పేరు ఎవరు డీఆర్ఓకు సూచించారు అనే విషయం తెలియదు.