Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియా సింగరేణి ఓసి 2 ఉప్పరితల గనిని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర రెడ్డి ఆదివారం సందర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలు పూర్తిస్థాయిలో రక్షణ పాటిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి పాటుపడాలని సూచించారు. 2022-23 ఏరియా వారిగా వార్షిక ఉత్పత్తి 116 సాధించడంలో కృషి చేయాలన్నారు. అనంతరం కేసీహెచ్పీలో బొగ్గు రవాణాలను పరిశీలించారు. ఉత్పత్తి అయిన బొగ్గును వృధా కాకుండా సరఫరా చేయాలన్నారు. అన్ని ఘనుల నుండి బొగ్గును క్రమం తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ జిఎం డి.రామచందర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్, ప్రాజెక్ట్ మేనేజర్ రాముడు, ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్ వీరభద్రుడు, సెక్యూరిటీ ఆఫీసర్ సభిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.