Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ దోమల రమేష్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీయ డానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సీఐ దోమల రమేష్ అన్నారు. ఆదివారం చిన్ననల్లబల్లి గ్రామంలో చిన్ననల్లబల్లి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే మండల స్థాయి టోర్నమెంట్ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అన్నె సత్యనారాయణమూర్తి బౌలింగ్ చేసి క్రీడా కారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత క్రీడలతో పాటు అన్ని రవగాలలో రాణించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నోటిఫికేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వేసవి ఎండల దృష్యా తగు జాగ్రత్తలు పాటించాలని నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లకీë, జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు, ఎంపీటీసీలు తునికి సీత, తెల్లం భీమరాజు, నిర్వహకులు తునికి కామేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దామెర్ల శ్రీనివాసరావు, పొడియం సుబ్బారావు, కొమ్ము రంజిత్ కుమార్, క్రీడా కారులు శ్యామల చంటి, తునికి జయరావు, రమేష్, సాయిబాబు, నాగార్జున్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.