Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా హామీ
నవతెలంగాణ-బూర్గంపాడు
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతా రావు హామీ ఇచ్చారు. ఆదివారం కరకగూడెం మండలం లోని బుర్దారంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన రేగాను బూర్గంపాడు అక్రిడేషన్ జర్నలిస్టులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ 2022న సీఎంవో నుంచి కొత్తగూడెంలోని 143 సర్వేలో జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల ప్రక్రియలో భాగంగా ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన తప్పకుండా జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతా మని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి కల నెరవేరుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేగా కాంతరావును శాలువాలతో పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బూర్గం పాడు మండల అక్రిడేషన్ జర్నలిస్టులు తోకల మోహన్ రావు, తాళ్ళూరి శ్రీహరి బాబు, కుందూరు శ్రీనివా సరెడ్డి, జక్కిరెడ్డి మల్లారెడ్డి, బర్ల జోష్, మంద పాటి వెంకటరెడ్డి, బండారి మహేష్, రామకృష్ణ, తేజావత్ వినోద్, ఆవుల మహేందర్రెడ్డి, పోతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుర్రం రవి తదితరులు పాల్గొన్నారు.