Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూక్య వీరభద్రం
నవతెలంగాణ-జూలురుపాడు
మర్చి 1, 2తేదీలల్లో మిర్యాల గూడంలో జరుగు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలనీ మార్చి ఒకటిన్నరకు భారీ బహిరంగ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం కొమ్ముగూడెం గ్రామంలో ముఖ్యుల సమావేశం బానోతు ఇస్రా నాయక్ అధ్యక్షతన జరిగిం ది. ఈ సమావే శంలో ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పై రాజీలేని పోరాటాలు నిర్వహించిందని, దానిలో భాగమే పోడుసాగు దారులకు పట్టాలు పంపిణీ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అని అన్నారు. ఈ మహాసభలో భవిష్యత్తు ఉద్యమల రూపాకల్పనా చేయనున్నట్లు గ్రామ పంచాయతీలకు అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలనీ, పోడు భూములకు ఇంకా మిగిలిన భూములకు వెంటనే సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇలాంటి సమస్యలపై ఈ మహాసభలో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బానోత్ ఇశ్రా, బానోత్ మధు, మోతిలాల్, మోతిబాయ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.