Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లు, జలవనరుల శాఖ కార్యదర్శితో మాట్లాడిన తుమ్మల
నవతెలంగాణ-దమ్మపేట
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భూములకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామా ఎత్తిపోతల పథకం పనులు సత్వరమే పూర్తి చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని గుండుగులపల్లిలోని ఆయన ఇంటిలో సీతారామా ప్రాజెక్ట్ ఇంజనీర్లతో మాట్లాడారు. నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్, ఇరు జిల్లా కలెకర్లతో ఫోన్లో మాట్లాడారు. పనుల్లో భాగంగా ఎత్తిపోత పథకాలు (లఫ్టులు) పూర్తి అవుతున్నాయి కానీ కాలువల పనులు ముందుకు సాగటం లేదని తుమ్మల గమనించారు. దీనిపై సంబందిత అధికారులను ప్రశ్నించగా సత్తుపల్లి ట్రంక్‌లో యాతాలకుంట సమీపంలో ఒక టన్నెల్ ఉందని, భూ సేకరణ సమస్యల కారణంగా పనలు ముందుకు సాగటం లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్వోఎస్ఆర్ పట్లాలు ఇచ్చిఉన్నారని ఇక్కడ భూ సేకరణలో జాప్యం వల్ల కాలువల పనులు జరగడం లేదని తెలిపారు. వీటితో పాటు 14 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. మూడు నాగుగేళ్ల కాలంలో పూర్తి కావాల్సిన పనులు ఏడేళ్లయినా పూర్తి కాలేదని గుర్తించి ఈ మేరకు సమస్యను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. కేవలం రూ.90 కోట్లు విడుదల చేస్తే పనులు వెంటనే పూర్తి చేస్తే వచ్చే సీజన్‌కే సత్తుపల్లి మండలంలో బేతుపల్లి పెద్ద చెరువులకు సీతారామా ద్వారా గోదావరి నీళ్లు మళ్లించవచ్చని కలెక్టర్లకు వివరించారు. బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ప్రత్నామ్యాయ కాలువ ద్వారా మరో మూడొందల చెరువులకు గోదావరి నీటిని మళ్లించే అవకాశం ఉందని కలెక్టర్లకు వివరించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట, దమ్మపేట మండలం నాగుపల్లి వద్ద భూ సేకరణ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పరిహారం విషయంపూ కోర్టులో సత్వరమే సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. మొత్తం రూ.250 కోట్లు అయితే భూ సేకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని, సత్తుపల్లి ట్రంక్‌లో మాత్రం రూ.90 కోట్లు ఖర్చు చేస్తే బేతుపల్లి చెరువకు ముందుగా గోదావరి జలాలు వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. ఈ దిశగా దృష్టి సారించాలని కోరారు.