Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా కార్పొరేట్ ఏరియాలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ వార్షికోత్సవం
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ క్రీడాకారులకు సంస్థ ఎంతో ప్రోత్సాహా నిస్తుందని సింగరే ణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె.బసవయ్య, జిఎం పర్సనల్ ఈఈ ఏ.కుమార్ రెడ్డి అన్నా రు. ఆదివారం కొత్తగూ డెం కార్పొరేట్ ఏరియాలో డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ వార్షికోత్సవం స్థానిక ప్రకాశం స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. సంస్థకు చెందిన పలువురు క్రీడాకారులను ఘణంగా సన్మానించారు. ఈ సందర్భం వారు మాట్లాడారు. ఆటలు వినోదం, ఆనందం అందిస్తుందన్నారు. ఆటలను ఆడుతున్నప్పుడు చింతలు, ఆందోళనలను మర్చిపోయి, ఆటపైకి మనసుని మళ్లించేందుకు సహాయపడతాయని అన్నారు. కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ టీమ్ స్పిరిట్‌తో ఉత్పత్తి, రక్షణలో కూడా మెరుగుదల ఉందని అన్నారు. అనంతరం కోల్ఇండియాలో పథకాలు సాధించిన మాన్విత, బుజ్జి, కేఆర్ఎల్ రెడ్డిని సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కె.శ్రీనివాస రావు, కార్పొరేట్ టిబిజికేఎస్ ఉపాధ్యక్షులు సోమిరెడ్డి, సీనియర్ పిఓ అండ్ హనరరీ సెక్రెటరీ గట్టు స్వామి, స్పొర్ట్స్ సూపర్వైసర్లు సుందర్ రాజు, సేవా సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.