Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లందు అధ్యక్షులు ముద్రగడ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజల కోసం...ప్రగతి కోసం ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఎన్టీఆర్ భవన్లో జాతీయ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ పాల్గొని ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గం కిట్‌ను అందించారు. ఈ సందర్భంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం అనేక కార్యక్రమలు చేసిందనిచ ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమలను ఈ దేశంలో పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. రూ.2 కిలో బియ్యం ఎన్టీఆర్ మొదులుపెడితే, రైతు, పేద వారి పిల్లలు ఐటీ రంగంలో కంపెని పెట్టే స్థాయిలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని అన్నారు. పార్టీ ప్రతి గ్రామంలో బడి, రోడ్డు, వాటర్ టాంక్లు మరెన్నో కార్యక్రమంలను చేసిందని ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నుండి ఇదే విషయాన్ని తెలియజేస్తాం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి టీడీపీ సీనియర్ నాయకులు గుడిపూడి మోహన్ రావు, కారు నర్సయ్య, నూతలపాటి రవి, చాందావత్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.