Authorization
Thu April 10, 2025 03:04:08 pm
- రైతు సంఘం నాయకులు బండి రమేష్
ఖమ్మం రూరల్ : మార్చి 1,2 తేదీలలో మిర్యాలగూడెంలో జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ అన్నారు. గిరిజన సంఘం మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ గిరిజన మహాసభలు జయప్రదం చేసేందుకు ఆర్థికంగా,హార్దికంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బానోత్ శ్రీనివాస్, భూక్య నాగేశ్వరరావు, నాయకులు గన్యా నాయక్, మల్సూర్, భూక్య రవి నాయక్, హర్యానాయక్, బోడ భిక్షం, రమేష్, శివ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.