Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న చలో ఢిల్లీ
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
రైతు వ్యవసాయ కార్మికుల శ్రామిక ప్రజల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శన ధర్మాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం సంఘం, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక మండల సదస్సు గుండా సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల కేంద్రంలో ని సిఐటియు ఆఫీసు నందు జరిగింది. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. ఈ దేశంలో కార్మికుల కర్షకుల పట్ల మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ప్రజలపై అనేక భారాలను మోపుతోందని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం చేసి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగం ప్రైవేటు పరం చేయుటకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగంకు నిధులు కేటాయింపు భారీ కోత విధించిందని అన్నారు. ఎరువులు సబ్సిడీ ఏభై వేల కోట్ల రూపాయల తగ్గించటం వ్యవసాయ పరిశోధనలకు నిధులు కేటాయింపు లేకుండా చేయడం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ మూసి వేయాలనే ఆలోచన విరమించు కోవాలన్నారు. ప్రభుత్వ సంస్థలన్నీటిని కార్పోరేట్ సంస్థలకు ధారాధత్వం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో సాధించుకున్న టువంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడులుగా మార్చి వారి హక్కులను హరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన టువంటి రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక కోడులను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు. ఏన్కూరు మండలం నుండి వేలాదిగా ప్రజలు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా లక్ష్మా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇటికాల లెనిన్, సిఐటియు మండల కార్యదర్శి ఏర్పుల రాములు, ఏన్కూర్ సొసైటీ ఉపాధ్యక్షులు రేగళ్ళ తిరుమలరావు, రైతు సంఘం మండల అధ్యక్షులు తమ్మినేని వెంకటయ్య, బండ్ల చిన్న జోగయ్య, నండూరి శ్రీనివాసరావు, బుచ్చాల వెంకటేశ్వర రావు, కాలంగి నాగయ్య, ఇమ్మడి, రోశయ్య నరిసింహ రావు, దొంతిబోయిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.