Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఎస్బిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో గత ఐదు రోజులుగా టాస్క్ సౌజన్యంతో ఎంబిఎ విద్యార్ధులకు జరుగుతున్న 5రోజుల శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఎంబిఎ విద్యార్థులకు ప్రస్తుతం కంపెనీలు చాలా అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. వారి ఇంటర్వ్యూ అవసరాలు మెరుగుపరిచేందుకు వారికి సరైన మార్గ నిర్దేశనం చేసేందుకు టాస్క్ ఆధ్వర్యంలో మరిన్ని శిక్షణలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు తమకు ఉన్న విషయ పరిజ్ఞానాన్ని ఇంటర్వ్యూలలో ప్రదర్శించి విజయం సాధించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. దీనిలో విద్యార్ధులకు సాప్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, రెజ్యుం ప్రిపరేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ లీడర్ షిప్ క్వాలిటీస్ లను నేర్పించడం జరిగిందన్నారు. కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ జి. ధాత్రీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంబిఎ విద్యార్ధులు ఇంటర్వ్యూలలో విజయం సాధించాలని, యాజమాన్యం కల్పించే ఇటువంటి శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కార్పొరేట్ కంపెనీలలో ఉన్నత స్థానం కోసం ఇలాంటి శిక్షణలు అవసరం అన్నారు. అనంతరం టాస్క్ శిక్షకుడు థామస్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంధం శ్రీనివాస రావు, ఎకడమిక్ డైరెక్టర్లు ఎవివి శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా. జి.సుభాష్ చందర్, జె. రవీందర్ బాబు, అధ్యాపకులు రామకృష్ణ, ఎన్. సతీష్ కుమార్, టిపిఒలు ఎ.మల్లిఖార్జున్, ఎన్.సవిత తదితరులు పాల్గొన్నారు.