Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల డైరెక్టర్ నాగిరెడ్డి
నవతెలంగాణ-ఇల్లందు
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోని, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని సాహితి జూనియర్ కళాశాల తేజ ప్రిన్సిపాల్, డైరెక్టర్ నాగిరెడ్డి ఆకాంక్షించారు. పట్టణంలోని 14 నెంబర్ బస్తీలో ఆదివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామ లింగేశ్వర రావు, ముకుందాపురం విశ్వశాంతి హై స్కూల్ డైరెక్టర్ తుమ్మలపల్లి ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ గుజ్జర్లపూ డి రాంబాబు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.