Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల అధికారులను దుర్భాషలాడిన ఉద్యోగులు
- సామరస్యంగా ఎన్నికలు జరపాలి
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, 26వ తేదీ ఆదివారం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల సందర్భంగా జరిగిన గలాట వలన ఉద్యోగ సంఘం ఎన్నికలు వాయిదా వేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టిపిఆర్ఎంఈఎ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల కన్వీనర్ టి.అంకుబాబు జిల్లా టీఎన్బిఓ అధ్యక్షులు అమారనేని రామారావుని ఎన్నికల అధికారిగా నియమించారు. ఈ క్రమంలో ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా నిబంధనల ప్రకారం, జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్ నందు నామినేషన్లు జారీ చేసిన తదుపరి, నామినేషన్లను స్వీకరించారు. ఆ తరువాత నామినేషన్లు నిబంధనల ప్రకారం పరిశీలించారు. పరిశీలనలో కొన్ని నామినేషన్లు అర్హత పొందాయి. కొన్ని తిరస్కరణకు గురయ్యాయి. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవికి వచ్చిన టి.అంకుబాబు, జి.శ్రీనివాసరావు నామినేషన్లు, రాష్ట్ర కౌన్సిలర్-2 పదవికి వచ్చిన నామినేషన్లు నిభందనలకు విరుద్ధంగా ఉన్నవని ఎన్నికల అధికారి నిర్ణయించగా, నిర్ణయాన్ని జిల్లా ఎన్నికల కన్వీనర్ అయిన టి.అంకుబాబు వ్యతిరేకిస్తూ, తన ప్యానల్, మద్దతు సభ్యులు అయిన కె.వెంకటేశ్వర్లు, పి.శ్రీకృష్ణ, పి.మోహన్ రెడ్డిలు, దమ్మపేట మండల ప్రజాపరిషత్ పర్యవేక్షకులు డి.విద్యాధర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్ వారి ప్యానల్ విజయం సాధిస్తున్నారనే అక్కసుతో ఎన్నికల అధికారిపై విరుచుకుపడ్డారు. దుర్భాషలాడుతూ, ఎన్నికల ప్రక్రియను అడ్డగించారు. మొత్తంగా ఎన్నికల ప్రక్రియను ఆటంకం కలిగించే విధంగా ప్రయత్నించారు. ఎన్నికలకు ఇబ్బంది కలిగించిన సంధర్భంలో ఎన్నికల అధికారి ఎన్నికల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మెజారిటి సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని కోరినప్పటికీ, ఎన్నికల అధికారిని దుర్భాషలాడుతూ ఎన్నికల జరుగు ప్రదేశంలో ఒక భయానకా వాతావరణం సృష్టించి ఎన్నికల అధికారిని తన విధులను నిర్వహించకుండా ఆటంకం కలిగించిన నేపద్యంలో తప్పని పరిస్థితిలో ఎన్నికలు వాయిదా వేశారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
ఎన్నికల అధికారిని వారే నియమించి, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయించి, ఎన్నికల రోజు, అదే అధికారి నుండి నామినేషన్లు స్వీకరించి, నామినేషన్లు సమర్పించి, నామినేషన్ల పరిశీలనలో జిల్లా అధ్యక్షుని పదవికి నామినేషన్ వేసిన టి.అంకుబాబు నామినేషన్ తిరష్కరణకు గురి అయి న కారణంగా, ఎన్నికల అధికారిని తన ప్యానల్ సభ్యులచే గొడవ చేయించారని, ఎన్నికలు జరిగితే తమ ప్యానల్ ఓడిపోతుందని అక్కసుతో, ఎన్నికలు జరగకుండా చేసిన చర్యను దమ్మపేట మండల ప్రజాపరిషత్ పర్యవేక్షకులు విద్యాధర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్‌ల ప్యానల్ వారు తీవ్రంగా ఖండిస్తూ, ఎన్నికలు సజావుగా జరపాలని రాష్ట్ర కమిటీ కోరారు.
క్షమాపణ....
జిల్లా టీఎన్జిఓ అధ్యక్షులు అమారనేని రామారావు ఎన్నికల అధికారికి దమ్మపేట మండల ప్రజాపరిషత్ పర్యవేక్షకులు విద్యాధర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్‌లు క్షమాపణలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనను పత్రికా ముఖంగా మన్నించమని కోరారు. సోదర సంఘం అయిన టీఎన్జిఓని గౌరవించాలని కోరారు.