Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామ్రేడ్ కృష్ణ ది పార్టీకే అంకితమైన కుటుంబం
- కృష్ణ ఇల్లు పార్టీ కార్యక్రమాల కేంద్రం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-మణుగూరు
కామ్రేడ్ పిట్టల కృష్ణ కుటుంబం సమసమాజ స్థాపన, పేదల రాజ్యం కోసం పోరాటం చేసిందని సీపీఐ(ఎం) పార్టీకి అంకితమైందని ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఆదివారం పార్టీ మండల కార్యదర్శి కొడిశాల రాములు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పిట్టల కృష్ణ కుటుంబం కోసం కాకుండా సమాజంలో ప్రజల కోసం పని చేశారన్నారు. అనేక ఒత్తిళ్లు ఆటంకాలు, భ్రమలు, డబ్బులు ప్రభావం చూపుతున్న రోజుల్లో ఎర్ర జెండా పట్టుకొని ముందుకు నడవడం గొప్ప త్యాగమన్నారు. సమాజం మార్పు కోసం అందరికీ ఉద్యోగాలు రావాలని అందరూ చదువుకోవాలని సమసమాజం కోసం కమ్యూనిస్టు పరిపాలన కోసం ఆలోచించి కృష్ణ కుటుంబం పనిచే స్తుందన్నారు. కష్ట జీవుల పార్టీ సీపీఐ(ఎం)లో కృష్ణ కుటుంబం అంతా పనిచేశారన్నారు. కృష్ణ బతకడం కోసం కుటుంబం ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కరోనా తర్వాత గుండె జబ్బులు ఎక్కువ ఉన్నాయని అన్నారు. కష్టజీవుల కోసం పనిచేయడమే కృష్ణకు నిజమైన నివాళి అన్నారు.
కృష్ణ ఇల్లు పార్టీ కార్యక్రమాల కేంద్రం : అన్నవరపు కనకయ్య
కామ్రేడ్ పిట్టల కృష్ణ నాగమణి ఇల్లు కేంద్రంగా వ్యవసాయ కార్మిక పోరాటాలు పార్టీ కార్యక్రమాలు జరిగినాయని అన్నారు. కృష్ణ ప్రోత్బలంతో నాగమణి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యురాలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కృష్ణ లేని లోటు అశోక్ నగర్ సమితి సింగారం పంచాయతీలో తీరని లోటు అన్నారు.
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు : నెల్లూరి నాగేశ్వరరావు
కామ్రేడ్ కృష్ణ తల్లిదండ్రులు మల్లయ్య-మల్లమ్మలు వారిది ప్రేమ వివాహం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కృష్ణ కుటుంబం నాగమణి కుటుంబ నేపథ్యం వామపక్ష భావజాలం కలిగి ఉన్నది. అందుకే ప్రజల పక్షపాతి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదల పక్షాన పోరాడిన కుటుంబమని కొనియాడారు. వారి మరణం సంతాప సభలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు లెనిన్ బాబు, టీవీ ఎం.వి.ప్రసాద్, ఉప్పతల నరసింహారావు, బొల్లం రాజు, తోట పద్మ, వై.నాగలక్ష్మి, టేకుల సత్యవతి, పిట్టల నాగమణి, సాంబశివరావు, స్వరూప, సంకినేని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.