Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అద్వర్యంలో హన్మకొండ, జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో ఈ నెల 25, 26వ తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భద్రాద్రి జిల్లా అథ్లెట్లు 20 మంది పాల్గొని 14 పతకాలు సాధించారు. ఇందులో 9 బంగారు పతకాలు, 4 రజిత పతకాలు, 1 కాంశ్య పతకం గేలుపొందారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ తెలిపారు. పాల్వంచకు చెందిన ఆర్.అభినరు నాయక్, లాంగ్ జంపు, 110 మీటర్ల హర్డిల్స్‌లో రెండు బంగారు పతకాలు, టేకులపల్లికి చెందిన జి.సిద్ది వినరు, హై జంపులో బంగారు పతకం కొత్తగుడెంకు చెందిన ఎం.ఇందు, 3 కీలోమీటర్లలలో బంగారు పతకం, ఎం.సంగీత 5కీలోమీటర్ల వాకింగ్‌లో బంగారు పతకం, ఏ.వందన, డిస్కస్ త్రో లో బంగారు పతకం, ఎం.అఖిల్, 3000మీటర్ల పరుగుపందం లో బంగారు పతకం, జె.వరుణ్ 400 మీటర్ల పరుగుపందంలో బంగారు పతకం, పాల్వంచ కు చెందిన బి.దేఖేష్ సౌమిత్ 400 మీటర్ల హర్డిల్స్‌లో రజిత పతకం, కొత్తగుడెంకు చెందిన ఎం.సింధు 400 మీటర్ల పరుగుపందంలో రజిత పతకం, ఏ.వందన, షాట్ పుట్ త్రో లో రజిత పతకం, అభినవ, అశోక్, అఖిల, సౌమిత్లు రిలే లో రజిత పతకం, పాల్వంచ కు చెందిన కె.అశోక 400 మీటర్ల పరుగుపందంలో కాంస్య పతకం గేలుపొందారని తెలిపారు. ఈ సందర్బముగా క్రీడాకారులను, కోచ్‌లు పి.నాగేందర్, జన్ను గిరి ప్రసాద్, నరేష్, మల్లికార్జున లను రాష్ట్ర అసోసియేషన్ అద్యక్షులు స్టాన్లీ జోన్స్, కార్యదర్శి కె.సారంగపాణి, భద్రాద్రి జిల్లా అద్యక్షులు గొట్టపు రాధాకృష్ణ, చైర్మన్ జివి.మనోహర రావు అభినందించారు.