Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాత్కాలిక అభివృద్ధి కాదు శాశ్వత పరిష్కారమే నా జీవిత లక్ష్యం
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-కరకగూడెం
రాష్ట్రంలో, పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పై గ్రామాల్లో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం మండలంలోని సమత్ భట్టుపల్లి గ్రామంలోని శ్రీ సువర్ణగిరి జ్వాలా లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రేగా కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో కరకగూడెం మండల ముఖ్య నాయకుల, కార్యకర్తల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రేగా మాట్లాడుతూ మండలానికి కోట్లాది రూపాయల నిధులతో మండలన్నీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరి గతంలో ఎన్నడలేని విధంగా అన్ని గ్రామాలకు రహదారులను, వంతెనలను నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. తాత్కాలిక అభివృద్ధి కాదు శాశ్వత పరిష్కారమే నా జీవిత లక్ష్యం అని అన్నారు. రైతులకు సాగునీరు అందించే విధంగా నూతన ప్రాజెక్టులను నిర్మిస్తానాని అన్నారు. విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలియజేశారు. మండల వ్యాప్తంగా రైతులకు సాగునీరు అందించే విధంగానే చెక్ డ్యాం నిర్మించుకోవడం జరిగింది గుర్తుచేశారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కృషి చేయాల ని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాబోయే రోజులలో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లతో పినపాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెడతా నన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, బూర్గంపాడు మార్కెటింగ్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాయం నరసింహారావు, అన్ని పంచాయతీల సర్పం చులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టి సతీష్, సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పెద్ద రామలింగం, యువజన నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.