Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాకు మంచి పేరు తేవాలి
- రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
నిరుద్యోగ యువకులు ఉద్యోగ సాధనలో ముందు వరసలో ఉండాలని, మన జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్, డాక్టర్ జిఎస్ఆర్ట్రస్టు నిర్వహకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఆదివాంర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉద్యోగ సాధన కోసం జరుగనున్న వివిధ పోటీ పరీక్షలకు సమయాత్తం అవుతున్న 200 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఆదివారం నుండి 4 నెలల వరకు ఉచిత మధ్యాహ్న భోజన పధకం, ఉచిత వైఫైవ్ సౌకర్యం డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేసిన డాక్టర్ గడల శ్రీనివాస రావు సౌజన్యంతో ప్రారంభించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గడల శ్రీనివాస రావు మాట్లాడారు. ఈ ప్రాంతంలో జన్మించిన నేను ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కలగడం తన అదృష్టమని, తాను చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాల ద్వారా లబ్ది పొంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే అది తనకు సంతృప్తి కలిగిస్తుందన్నారు. ప్రతి రోజు 200 మందికి ఉచితంగా అందించే మద్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన వడ్డించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అదికారి (డిపిఆర్ఓ) శీలం శ్రీనివాసరావు, గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ మోరే భాస్కర్, పాల్వంచ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, సంస్థ జిల్లా కార్యదర్శి కనకవల్లి గ్రంధ పాలకులు వరలక్ష్మి , నవీన్, మధుబాబు, మునీర్ తదితరులు పాల్గొన్నారు.