Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ - బోనకల్
ఉపాధ్యాయ, కమ్యూనిస్టు పోరాట యోధుడు పిల్లలమర్రి వెంకటేశ్వరరావు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మండల పరిధిలోనే ముష్టికుంట గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, సిపిఎం సీనియర్ నాయకుడు పిల్లల మర్రి వెంకటేశ్వరరావు (85) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. మృతదేహంపై సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, నవతెలంగాణ మాజీ జనరల్ మేనేజర్ మన్నేపల్లి సుబ్బారావు సిపిఎం పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. పిల్లలమర్రి వెంకటేశ్వరరావు 30 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశాడు. వృత్తిని పరమాదిగా భావించి క్రమశిక్షణగా ఎంతో అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాలలో తమ సేవలను అందించాడు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తమ సొంత గ్రామం ముష్టికుంట్ల గ్రామంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులుగా, మండల కమిటీ సభ్యులుగా, సిపిఎం ముష్టికుంట్ల గ్రామ కమిటీ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. ముష్టికుంట్ల ఉపసర్పంచిగా ఒకదాఫా పని చేశారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పలువురికి ఆదర్శవంతంగా పనిచేశాడు. మృతి చెందే వరకు సిపిఎం జెండా నీడని తన జీవితాంతం కొనసాగాడు. ముష్టికుంట గ్రామంలో జరిగిన ప్రతి ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం కృషి చేశాడు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మృతునికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. తన నలుగురు సంతానం కూడా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు.
నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరు పిల్లలమర్రి: పోతినేని సుదర్శన్ రావు
పిల్లలమర్రి వెంకటేశ్వరరావు నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కొనియాడారు. అంతిమయాత్ర సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పిల్లలమర్రి వెంకటేశ్వరరావుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్నారు. ఆయన జీవితం ఆదర్శవంతంగా కొనసాగిందన్నారు. జానకిపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానన్నారు. విద్యాబోధన చేయటంలో పిల్లలమర్రి వెంకటేశ్వరరావు ఎంతో నేర్పరి అన్నారు. తన గురువుగా వెంకటేశ్వరరావు ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుడిగా పని చేసిన సమయంలో ఎంతోమంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దారన్నారు. నేడు ఎంతోమంది ఉన్నత స్థానంలో తమ జీవితాలను కొనసాగిస్తున్నారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కషి చేయాలని కోరారు. పార్టీ పట్ల అంకిత భావం ఆయనకు మరో మంచి గుణం ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా పార్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. మృతదేహాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, అలవాల నాగేశ్వరరావు సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్ము శ్రీనివాస్ రావు, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, మర్రి తిరుపతిరావు, దొప్ప కొరివి వీరభద్రం, ముష్టికుంట్ల మాజీ సర్పంచులు కొంగర వెంకటనారాయణ, బంధం వెంకటరాజ్యం సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శులు బొడ్డుపల్లి కోటేశ్వరరావు, పిల్లల మర్రి నాగేశ్వరరావు, షేక్ నజీర్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బంధం నాగేశ్వరావు ముష్టికుంట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు పలువురు సిపిఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ నాయకులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర:
పిల్లలమర్రి వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఓ ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ అంతిమయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండ కొనసాగింది.
'పిల్లలమర్రి' మృతదేహానికి టీఎస్ యుటిఎఫ్ నివాళి
బోనకల్ : టిఎస్ యుటిఎఫ్ మాజీ నాయకులు, సిపిఎం సీనియర్ నాయకులు పిల్లలమర్రి వెంకటేశ్వరరావు మృతదేహానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు గోదా వెంకట నాగమల్లేశ్వరరావు, జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు, జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, సీనియర్ నాయకులు రావిరాల లక్ష్మణరావు, తాళ్లూరి ఆంజనేయులు ఎర్రుపాలెం మండల అధ్యక్ష, కార్యదర్శులు బండారు నాగరాజు, అనుమోలు కోటేశ్వరరావు మధిర అధ్యక్షుడు ఏ వినోద రావు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కళ్యాణం నాగేశ్వరరావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వాసిరెడ్డి మల్లికార్జున్ రావు టీఎస్ యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు శాఖమూరి శ్రీరామ్, మాజీ సీనియర్ నాయకులు నీలం లక్ష్మీనారాయణ, సందర్శించి నివాళులర్పించారు.