Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాలెంట్ ఇక్కడితో ఆగిపోవద్దు..
- బట్టీ పట్టే విధానాన్ని విడనాడండి
- డిఈఓ సోమశేఖర శర్మ
నవతెలంగాణ-వైరా
దేశంలో మేధావుల కొరత ఉందని విద్యార్థినిలు ఆ కొరతను తీర్చాలని ఖమ్మం విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ కోరారు. వైరాలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో 40వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యా, ప్రేమ, సమపాళ్లలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అందజేయాలన్నారు. ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషన్ చదువుల్లో ఉద్యోగ అర్హత కలిగిన వారు కేవలం 18 శాతం మాత్రమే ఉన్నారని, ఆ విభాగాల్లో రాణించాలని ఆయన సూచించారు. సమాజంలో అమ్మాయిలకు సగం అనే పేరు నామ మాత్రంగానే ఉందని కొన్నిచోట్ల అమ్మాయిలు వివక్షకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అందరూ బట్టీ విధానాన్ని విడనాడి 21 శతాబ్దం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వార్షికోత్సవంలో ప్రిన్సిపల్ బి.రమ, ఉపాధ్యాయని బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు కలారంజకంగా ఉన్నాయి.రెసిడెన్షియల్ పాఠశాల వార్షికోత్సవం లో ఏన్కూరు గురుకుల పాఠశాల (బాలురు) ప్రిన్సిపల్, జనవిజ్ఞాన వేదిక నాయకులు మల్లెంపాటి వీరభద్ర రావు, మునిసిపల్ కమీషనర్ అనిత తదితరులు పాల్గొన్నారు.