Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండల పరిధిలోని మేడిదపల్లి గ్రామంలో గ్రంథాలయాన్ని సర్పంచ్ బండ్ల విజయ సురేష్ ఆధ్వర్యంలో 2021 ఫిబ్రవరి 14న ఏర్పాటు చేశారు. ఈ గ్రంధాలయం ఏర్పాటు చేయడంలో ఎంపీటీసీ యర్ర పుష్పలత, ఉపసర్పంచ్ మోర ఉపేందర్ రెడ్డి, మరీ ముఖ్యంగా సైబర్ యూత్ మేడిదపల్లి కీలక పాత్ర పోషించారు. వీరు గ్రంథాలయానికి పెయింటింగ్, బుక్స్, ఫర్నిచర్, ఫాన్స్, లైట్స్ గ్రంథాలయానికి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఆదుకోవడానికి చిల్డ్రన్ పార్క్ కి సంబంధించిన మెటీరియల్స్ ని గ్రామపంచాయతీ వారికి డొనేట్ చేయడం జరిగింది. సైబర్ యూత్ వారు వివిధ రాష్ట్రాలలో మరియు వివిధ దేశాలలో ఉద్యోగం చేస్తూనే వారి స్వంత గ్రామానికి ఉచితంగా సేవ చేయడం అనేది వారి మంచి మనసుకు నిదర్శనమని సర్పంచ్ బండ్ల విజయసురేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి ఉపేందర, గ్రామపెద్దలు మరియు యువతి యువకులు పాల్గొన్నారు.