Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
చండ్రుగొండ రైతు వేదికలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ కార్యక్రమానికి చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీహెచ్ఎన్ వై.యశోద, హెల్త్ సూపర్వైజర్లు జి.చంద్రకళ, బి.సారా రాణి మాట్లాడుతూ... గత మూడు రోజులుగా చండ్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.